మంచి నీటి బావిలో వ్యర్ధాలు
బావితో చిన్న పిల్లలకు పొంచి ఉన్న ప్రమాదం
కంచే ఎర్పాటు చేసి వ్యర్ధాలను తీసివేయాలని అధికారులను కోరుతున్న కాలని వాసులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మే 24
మఠంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ మాదిగ వాడలో కొన్ని దశాబ్దాల కాలం నుండి కాలనీ మధ్యలో మంచినీటి బావి కలదు.ఇంతకు ముందు కాలని వాసులు ఆ బావిలోని నీటిని త్రాగే వారు .అదేవిధంగా కాలనీలో ఎవరు నూతన గృహ నిర్మాణంలో ఆ బావికి మోటార్లు వేసి వాటి నీటిని ఉపయోగించు కొని నీటి అవసరాలు తీర్చుకునేవారు .
మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని ఏండ్ల క్రితం మోటార్ల ద్వారా కాలనీకి పైప్ లైన్లు వేయడంతో ఆ బావి నీళ్లు వాడకం తగ్గింది ఇంక చెప్పాలంటే ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి మంచి నీరు రావడంతో ఇంకా బావి నీరు వాడకం తగ్గింది.
ఎవ్వరూ పట్టించుకోవడంతో అట్టి బావిలో వ్యర్ధాలు పేరుకుపోయి బావికి ఇరు ప్రక్కల చెట్లు మొలవడంతో నీరు దుర్వాసన వస్తుందని అవాసనతో కాలనీవాసులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.అదేవిధంగా ఆబావి ప్రక్కన పరిసర ప్రాంతంలో చిన్న పిల్లలు ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని తల్లిదండ్రులు కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున గ్రామ అధికారులు స్పందించి ఆ బావిలోని వ్యర్థాలను తొలగించాలని బావికి చుట్టూ ఐరన్ తో కంచే వేయాలని కాలని వాసులు కోరుతున్నారు.