గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్ నోట్.. గ్రూప్-1 పరీక్షపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన జూన్ 9వ తేదీనే పరీక్ష జరుగుతుందని..OMR విధానంలో పరీక్ష జరుగుతుందని గురువారం ప్రెస్ నోట్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. సాంపిల్ OMR షీట్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇక OMR షీట్‌పైనే అభ్యర్థికి సంబంధించిన అంశాలు ప్రింట్ అయ్యి వస్తాయని.. అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నెంబర్ మాత్రమే బబ్లింగ్ చేయాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ …

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్ నోట్..

గ్రూప్-1 పరీక్షపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన జూన్ 9వ తేదీనే పరీక్ష జరుగుతుందని..OMR విధానంలో పరీక్ష జరుగుతుందని గురువారం ప్రెస్ నోట్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. సాంపిల్ OMR షీట్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ఇక OMR షీట్‌పైనే అభ్యర్థికి సంబంధించిన అంశాలు ప్రింట్ అయ్యి వస్తాయని.. అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నెంబర్ మాత్రమే బబ్లింగ్ చేయాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

హాల్ టికెట్ల విడుదల గురించి కూడా కమిషన్ కీలక సమాచారాన్ని పొందుపరిచింది. జూన్ 1 నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు ప్రెస్ నోట్‌లో పేర్కొంది.

హాల్ టికెట్ మీద ఉండే సూచనలను, అలాగే OMR మీద ఉండే సూచనలను కూడా అభ్యర్థులకు తెలియజేసింది కమిషన్. దీంతో గ్రూప్-1 విద్యార్థులు అలర్ట్ అయ్యారు.

కాగా గత ప్రభుత్వంలో రెండు సార్లు గ్రూప్-1 పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగులు నైరాశ్యంలో ఉన్నారు. ఈ సారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని, గతంలో జరిగిన తప్పులను పునరావృత్తం చేయకుండా పరీక్ష నిర్వహించాలని కమిషన్ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.

Updated On 24 May 2024 11:01 AM IST
cknews1122

cknews1122

Next Story