అమ్మ నన్ను వెతకొద్దు… నేను వెళ్ళి పోతున్న…
ఖమ్మంలో దారుణం…
రైలుకింద పడి బాలిక ఆత్మహత్య
‘అమ్మా నేను చనిపోతున్నాను … నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన మైనర్ బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం సారథినగర్కు చెందిన బాలిక(17) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాలికతో పాటు ఉన్న యువకుడు అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడ్డారు.
తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతి చెందింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మృతురాలు మీద ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు సమాచారం అందించినట్లు వారు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పూర్తి వివరాలు తెలియజేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ ఆర్పీ, వరంగల్ ఆర్పీఎస్ తెలిపారు.
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది…