మెడికల్‌ ఆఫీసర్లను లైంగికంగా వేధించిన DMHO DMHO పై సస్పెన్షన్‌ వేటు లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటుపడింది. మహిళా మెడికల్‌ ఆఫీసర్లను లైంగికంగా వేధించినట్లు తేలడంతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్‌, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు. …

మెడికల్‌ ఆఫీసర్లను లైంగికంగా వేధించిన DMHO

DMHO పై సస్పెన్షన్‌ వేటు

లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటుపడింది. మహిళా మెడికల్‌ ఆఫీసర్లను లైంగికంగా వేధించినట్లు తేలడంతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్‌, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు కూడా ఆదేశించింది.ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్‌ సింగ్‌ నాయక్‌ బుధవారం నాడు కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు.

దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే మహిళా మెడికల్‌ ఆఫీసర్లను లక్ష్మణ్‌ సింగ్‌ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

Updated On 25 May 2024 9:56 PM IST
cknews1122

cknews1122

Next Story