విధి నిర్వహణలో కునుకుపాటు… కమిషనరే ఇలా అయితే... మున్సిపల్ కార్యాలయంలో టేబుల్ పై కాళ్ళు పెట్టి నిద్రపోయిన అధికారి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సరికొండ రుషికేశ్వర్‌రాజు మాట్లాడుతూ, మున్సిపల్‌ కమిషనర్‌ గురువారం టేబుల్‌పై కాళ్లు చాపి నిద్రిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో రావడం దురదృష్టకరమన్నారు. …

విధి నిర్వహణలో కునుకుపాటు…

కమిషనరే ఇలా అయితే...

మున్సిపల్ కార్యాలయంలో టేబుల్ పై కాళ్ళు పెట్టి నిద్రపోయిన అధికారి..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సరికొండ రుషికేశ్వర్‌రాజు మాట్లాడుతూ, మున్సిపల్‌ కమిషనర్‌ గురువారం టేబుల్‌పై కాళ్లు చాపి నిద్రిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో రావడం దురదృష్టకరమన్నారు.

కలెక్టర్‌, సీడీఎంఏ కమిషనర్‌ ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని కమిషనర్‌ను విధులనుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ సమాచార హక్కు చట్టం సాధనసమితి ప్రతినిధులు చిలుముల కొండల్‌, కార్తీక్‌రాజు, మచ్చ మధుకర్‌, మందశేఖర్‌, గణేశ్‌, అజయ్‌ ఉన్నారు.

Updated On 25 May 2024 1:26 PM IST
cknews1122

cknews1122

Next Story