ఫుడ్ సేఫ్టీ బృందాల తనిఖీ.
హోటల్ యాజమాన్యులకు నోటీసుల జారీ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మే 27,
భద్రాచలంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శ్రీ భద్ర గ్రాండ్ హోటల్, శ్రీ గౌతమి స్పైస్ హోటల్ , శ్రీ రాఘవేంద్ర టిఫిన్ అండ్ మీల్స్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ బృందాలు, వి జ్యోతిర్మయి జోనల్ అధికారిణి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా శ్రీ భద్ర హోటల్ నందు రిఫ్రిజిరేటర్ లో ఉంచిన 88 లీటర్స్ ఐస్ క్రీం ఫంగస్ మరియు పురుగులతో దుర్వాసన రావడంతో జోనల్ ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయి హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని 36 వేల విలువచేసే బూజు మరియు పురుగులు పట్టిన ఐస్ క్రీమ్ని ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. క్యాన్సర్ కారకాలైన కృత్రిమ హానికరమైన రంగులను బిర్యానీ మరియు తదితర ఆహార పదార్థాలలో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి అమ్ముతు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యం కు ఎఫ్ ఎస్ ఎస్ ఎ చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేసి, సుమారు 10 కేజీల రంగు కలిపిన బిర్యానిని ధ్వంసం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం వారిచే పదివేల రూపాయల జరిమానా విధించి రెక్టిఫికేషన్ కోసం హోటల్ మూసి వేయడం జరిగింది.
అదేవిధంగా పట్టణంలోని గౌతమి స్పైస్ రెస్టారెంట్లో సైతం తనిఖీలు చేయగా అపరిశుభ్రత వాతావరణ తో పాటు ఈగలు పురుగులతో వంటశాల మొత్తం నిండి ఉండటంనే గమనించిన అధికారులు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రిఫ్రిజిరేటర్ లో ఆహార పదార్థాలను నిలువ ఉంచడంతో పాడైన ఆహార పదార్థాలను వినియోగదారులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 25వేల రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా పట్టణంలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ మీల్స్ హోటల్ తనిఖీ చేసిన అధికారులు పాడైన కూరగాయలతో పాటు ఈగలు దోమలతో వంటశాల గది ఉండటానికి గమనించి యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఐదు వేల రూపాయల జరిమానాన్ని విధించారు. భవిష్యత్తులో హోటల్ రెస్టారెంట్లు నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడితే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారి జ్యోతిర్మై ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ యాదాద్రి నల్గొండ ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి భద్రాచలం గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ కృష్ణార్జునరావ్ తదితర అధికారులు పాల్గొన్నారు