స్థలవివాదంలో కార్పొరేటర్‌పై రౌడీషీటర్‌ దాడి స్థల వివాదంలో అమీర్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ సరళపై రౌడీషీటర్‌ దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌.ఆర్‌.నగర్‌ డివిజన్‌ ఏసీపీ పి.వెంకటరమణ, బోరబండ ఠాణా ఇన్‌ఛార్జి ఎస్‌.హెచ్‌.ఓ. బి.భూపాల్‌గౌడ్, ప్రత్యేక ఆర్‌.ఐ. కిరణ్‌రాజ్, స్థానికులు తెలిపిన ప్రకారం ఖైరతాబాద్‌ మండలం యూసుఫ్‌గూడ రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 128 పరిధి సారథి కోఆపరేటివ్‌ సొసైటీలో సుమారు రూ.5కోట్లు విలువచేసే 400 చదరపు గజాల స్థలం ప్రభుత్వ సీలింగ్‌ పరిధిలో ఉంది. …

స్థలవివాదంలో కార్పొరేటర్‌పై రౌడీషీటర్‌ దాడి

స్థల వివాదంలో అమీర్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ సరళపై రౌడీషీటర్‌ దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

ఎస్‌.ఆర్‌.నగర్‌ డివిజన్‌ ఏసీపీ పి.వెంకటరమణ, బోరబండ ఠాణా ఇన్‌ఛార్జి ఎస్‌.హెచ్‌.ఓ. బి.భూపాల్‌గౌడ్, ప్రత్యేక ఆర్‌.ఐ. కిరణ్‌రాజ్, స్థానికులు తెలిపిన ప్రకారం ఖైరతాబాద్‌ మండలం యూసుఫ్‌గూడ రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 128 పరిధి సారథి కోఆపరేటివ్‌ సొసైటీలో సుమారు రూ.5కోట్లు విలువచేసే 400 చదరపు గజాల స్థలం ప్రభుత్వ సీలింగ్‌ పరిధిలో ఉంది.

ఆ స్థలం తనకు చెందిందంటూ అమీర్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ సరళ అక్కడకు వచ్చారు.అక్కడకు వచ్చిన రౌడీషీటర్‌ షేక్‌ జావేద్‌ తమ స్థలంలోకి అనుమతి లేకుండా కారు ఎలా తెస్తారంటూ కార్పొరేటర్‌ అనుచరుడిపై చేయిచేసుకున్నాడు. అడ్డుకోబోయిన కార్పొరేటర్‌ను తోసేశాడు.

విషయం తెలుసుకున్న పార్టీ మహంకాళి సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యామ్‌సుందర్‌గౌడ్, నాయకులు అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏసీపీతో పాటు పోలీసులు చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు.

ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ ఎం.డి.నయీముద్దీన్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక ఆర్‌.ఐ. కిరణ్‌రాజ్‌ సారథినగర్‌కు చేరుకున్నారు. స్థలం పత్రాలు తమవద్ద ఉన్నాయంటూ కార్పొరేటర్, జావేద్‌ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆర్‌.ఐ.

ఆ స్థలం సీలింగ్‌లో ఉందని డాక్యుమెంట్లను పోలీసు అధికారులకు అందచేశారు. స్థలం వివాదంలో తాము కోర్టులో గెలిచామని.. రామ్‌చందర్, పర్శ రామ్మోహన్, సలీంఖాన్, ఎం.డి.రఫీయుద్దీన్‌ అక్కడకు వచ్చి పత్రాలను అధికారులకు చూపే ప్రయత్నం చేశారు. ఆర్‌ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జావేద్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 27 May 2024 1:00 PM IST
cknews1122

cknews1122

Next Story