ప్రైవేట్ హాస్పిటల్ కు పరుగులు పెడుతున్న 108 అంబులెన్సులు
ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కైన అంబులెన్స్ డ్రైవర్లు
పేషెంట్లను తప్పుదోవ పట్టిస్తూ నయా దంధా మొదలుపెట్టిన అంబులెన్స్ డ్రైవర్లు
ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
108 అంబులెన్స్ లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు తీసుకుపోతే కఠిన చర్యలు – కలెక్టర్
షాద్ నగర్:మే 29(ఆదాబ్ హైదరాబాద్)అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుతూ.. దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు వినియోగించే అంబులెన్స్‌ల విషయంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మొదటగా గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్ లు ఫోన్ చేయగానే వచ్చి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి రోగుల ప్రాణాలను నిలపడంలో ఈ అంబులెన్స్ ల పాత్ర కీలకమైంది.
కానీ కొందరు 108 అంబులెన్స్ డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పేషంట్లను దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోతున్నారు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పేషెంట్లు కానీ వారి బంధువులు కానీ త్వరగా నయమై ఈ గండం గడిస్తే చాలు రా బాబు అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు.
కానీ ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం వచ్చిన రోగుల వద్ద బిల్లులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కొన్ని సార్లు అయితే వారం పది రోజులు చికిత్స చేసి అందిన కాడికి డబ్బులు దండుకొని ఆ తర్వాత సీరియస్ గా ఉంది హైదరాబాద్ లోని పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలని చెప్పి పంపిస్తున్నారు.
అదృష్టం బాగుండి బయటపడేవారు కొందరైతే దురదృష్టంతో హైదరాబాద్ తీసుకుపోయే లోగానే మార్గం మధ్యలో చనిపోతున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం. తరచూ ఇలాంటి సంఘటనలు చూస్తూ కూడా అంబులెన్స్ డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు ప్రైవేటు హాస్పిటల్ కు మించిన వైద్య పరికరాలు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కు పేషంట్లతో పరుగులు పెడుతున్నారు.
ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకుపోతే వారికి పైసా రాదు. అందుకనే ముందుగానే సమాచారం ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి వెళ్లిపోతున్నారు ఇలా ప్రైవేటు హాస్పిటల్ తీసుకొచ్చిన అంబులెన్స్ సిబ్బందికి 5 నుంచి 10వేల రూపాయలు ఇస్తున్నట్లు మీడియాకు సమాచారం ఉంది.
ఏ అంబులెన్స్ అయినా ముందుగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యులు పరిశీలించి చికిత్స అందించిన తర్వాత రోగి గాని ఆయనకు సంబంధించిన బంధువులు ఎవరైనా సదుపాయాలు గాని ట్రీట్మెంట్ గాని నచ్చకపోతే మెరుగైన వైద్య సేవల కోసం ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేటు అంబులెన్స్ ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ డ్రైవర్ల కక్కుర్తికి ఒక్కొక్కసారి పేషెంట్లు బలైపోతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా కనీసం పేషెంట్లకు ఆలోచించుకునే సమయం కూడ ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి తెచ్చి పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో వేలల్లో ఖర్చయితే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి అన్ని లక్షలు ఖర్చుపెట్టినా కొన్నిసార్లు బ్రతుకుతారన్న భరోసా కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వలేకపోతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారం వైద్య ఆరోగ్య శాఖకు తెలియకుండా జరుగుతుందా అంటే సందేహమే. ఎందుకంటే 108 కాల్ చేస్తే ఒక అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ప్రమాదం జరిగింది ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది పక్కా సమాచారం ఉండాలి ఉంటుంది కూడా. మరి ఇదంతా పై అధికారుల దృష్టికి వెళ్లడం లేదా తెలిసిన ఎందుకు మౌనంగా ఉంటున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్ ల దందా మామూలుగా లేదు
మీడియాకు ఉన్న సమాచారం ప్రకారం 108 అంబులెన్స్ లు ఏబీవీ ప్రైవేట్ హాస్పిటల్ కు తరచూ పేషెంట్లను తరలిస్తున్నారన్న సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు శ్రీనివాస్ అనే 108 అంబులెన్స్ డ్రైవర్ TS 07 UK 6089 అనే వాహనంలో పేషంట్లను తీసుకొని ఏబీవీ హాస్పిటల్ దగ్గరకు వచ్చాడు.
ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకోకుండా ఇక్కడికి పేషెంట్లు తీసుకువచ్చావని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతూ అక్కడి నుంచి వాహనం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదే విషయమై పై అధికారులను వివరణ అడిగితే అవునా… అలాంటివి మా దృష్టికి రాలేదే…. అని తీరికగా సమాధానం దాటవేస్తున్నారు.
చూడాలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతే ఇలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటారేమో… పై అధికారుల చర్యలు ఎలా ఉంటాయో కొన్ని రోజులు వేచి చూద్దాం