నల్గొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయం పై ఏసిపి దాడులు
నల్గొండ జిల్లా రవాణా శాఖ DTO కార్యాలయంపై అవినీతి నీరోధక శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా డిటిఓ కార్యాలయం పై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకటేశ్వరరావు, మరో 9 మందిసిబ్బందితో డిటిఓ కార్యాలయంలో ఆకస్మిక దాడి చేశారు.
డిటిఓ కార్యాలయంలోకి ప్రవేశించగానే అధికారులు మొదటగా ప్రధాన ద్వారాన్ని మూసి వేయించారు. కార్యాలయం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
లైసెన్స్, ఆర్సి, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన 60 దస్తావేజులను, 12,500 స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా అదే కార్యాలయంలో పనిచేస్తు న్న కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు లోతుగా విచారణ చేస్తున్నారు.
పలు రికార్డులను పరిశీ లించి లోపాలను గుర్తించి నట్లు తెలిసింది. ఏసీబి అధికారుల తనిఖీల లోఆరుగురు ఏజెం ట్లు,దస్తావేజులు, నగదు లభించడంపై ఏసీబీ అధికారులకు పలు అనుమానాలు తలెత్తింది. దీంతో ఆశాఖ ఉద్యోగుల పనితీరుపై కూడా నివేది కను తయారు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఆ కార్యాల యంలో పనిచేస్తున్న ఉద్యోగుల తోపాటు అధికారులు, ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసి ఉన్నతా ధికారులకు పంపనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఏసీబీ అధికా రులు డిటివో కార్యాల యంలో ఆకస్మిక దాడులు చేయడం.. వెంటనే నగదు లభించడం కలకలం రేపింది.
అంతేకాకుండా పూర్తిస్థాయి విచారణ చేసి, నివేదిక తయారు చేసి ఉన్నతా ధికారులకు పంపిస్తామని ఏసీబీ అధికారులు చెప్పడంతో డిటిఓ ఉద్యోగులు, అధికారుల్లో అందోళన మొదలైంది.కాగా ఏసీబీ అధికారుల తనిఖీ సమయంలో జిల్లా రవాణా శాఖ అధికారి (డిటిఓ) అందుబాటులో లేడు. మిగతా సిబ్బంది ఉన్నారు…..