సబ్‌స్టేషన్‌లో రాసలీలలు.. నగ్నంగా దొరికిపోయిన విద్యుత్ ఉద్యోగి! మహిళతో అసభ్యకరరీతిలో దొరికిన ఉద్యోగి ఏలూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలలు బయపడ్డాయి. విధుల సమయంలో ఓ మహిళతో అసభ్యకరరీతిలో ఉద్యోగి దొరికిపోయాడు. తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని సబ్ స్టేషన్ కు వచ్చిన స్థానికులకు ఉద్యోగి రాసలీలలు కనిపించాయి. దీంతో వాళ్లు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది? జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌ లో …

సబ్‌స్టేషన్‌లో రాసలీలలు.. నగ్నంగా దొరికిపోయిన విద్యుత్ ఉద్యోగి!

మహిళతో అసభ్యకరరీతిలో దొరికిన ఉద్యోగి

ఏలూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలలు బయపడ్డాయి. విధుల సమయంలో ఓ మహిళతో అసభ్యకరరీతిలో ఉద్యోగి దొరికిపోయాడు.

తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని సబ్ స్టేషన్ కు వచ్చిన స్థానికులకు ఉద్యోగి రాసలీలలు కనిపించాయి. దీంతో వాళ్లు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగింది?

జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌ లో గంగు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షిఫ్ట్ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సబ్ స్టేషన్ కు ఫోన్ చేశారు.

అయితే ఫోన్ చేసిన ఎవరూ తీయకపోవడంతో కొందరు బుధవారం తెల్లవారుజామున స్థానికులు సబ్ స్టేషన్‌ కు వెళ్లారు. డ్యూటీ సమయంలో మహేశ్వర్ రెడ్డి మద్యం తాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన స్థానికులు చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇలాంటి పనులేంటని అతడిని ప్రశ్నించారు.

విద్యుత్ ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Updated On 29 May 2024 11:18 PM IST
cknews1122

cknews1122

Next Story