రూ.3లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సీఐ, ఎస్సై..!
ల్యాండ్ సెటిల్ మెంట్ కోసం రూ.3లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో ఎస్ఐ. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ షఫీ 3లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి ఎస్ఐ షఫీ రూ.3లక్షలు లంచం డిమాండ్ చేశారు.
లంచం డబ్బు తీసుకునేందుకు ఇద్దరు వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఎస్ఐ షఫీని అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ ఆఫీసుకి తరలించి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీస్ స్టేషన్ లోని ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. విచారణ తర్వాత ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్..
ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని 3లక్షలు డిమాండ్ చేశారు ఎస్ఐ షఫీ. అంతేకాకుండా.. సీఐకి కూడా ఇందులో వాటా కావాలని డిమాండ్ చేశాడు.
ఉపేందర్ ను మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీసులో లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నాం. వీరిపై పూర్తి విచారణ చేస్తున్నాము. ఇందులో ఎవరున్నా వదిలేది లేదు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరుల ఆట కట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా లంచాధికారులను పట్టుకుంటున్నారు.
తాజాగా ఓ ల్యాండ్ కేసులో లంచం డిమాండ్ చేసిన కుషాయిగూడ ఎస్ఐ షఫీ, మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ల్యాండ్ కేసు క్లోజ్ చేసేందుకు ఎస్ఐ షఫీ ఏకంగా రూ.3లక్షలు డిమాండ్ చేశారు.
కాగా, బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులే, న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా అన్యాయం చేస్తే ఎలా అని జనాలు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ పబ్లిక్ కు సేవ చేయాల్సిన అధికారులు ఇలా లంచాలకు రుచి మరగడం ఏంటని మండిపడుతున్నారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు.
ఇలాంటి లంచాధికారులను కఠినంగా శిక్షించాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. లంచం అడగాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని అంటున్నారు. కాగా, ప్రభుత్వ అధికారి ఎవరైనా పని చేసి పెట్టేందుకు లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.