ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారం Web desc : ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకొంది. దిశ ఎస్సై పి.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమికులు గురువారం ఏకాంతంగా గడిపేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు. అటుగా వెళ్తున్న హోంగార్డు రాజ్‌కుమార్‌ వారిని చూశాడు. పోలీసు వాహనంతో అక్కడికి వెళ్లి.. స్టేషన్‌కు రావాలని ప్రేమికులను బెదిరించాడు. వదిలేయాలని సదరు జంట వేడుకోవడంతో డబ్బులు …

ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారం

Web desc : ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకొంది. దిశ ఎస్సై పి.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమికులు గురువారం ఏకాంతంగా గడిపేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు.

అటుగా వెళ్తున్న హోంగార్డు రాజ్‌కుమార్‌ వారిని చూశాడు. పోలీసు వాహనంతో అక్కడికి వెళ్లి.. స్టేషన్‌కు రావాలని ప్రేమికులను బెదిరించాడు.

వదిలేయాలని సదరు జంట వేడుకోవడంతో డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు శుక్రవారం దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విజయనగరం జిల్లాకు చెందిన రాజ్‌కుమార్‌ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఘటన సమయంలో అతడి వెంట మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 1 Jun 2024 2:58 PM IST
cknews1122

cknews1122

Next Story