బోర్‌వెల్ వాహనం ఢీకొని హోంగార్డు మృతి
బోర్‌వెల్ వాహనం ఢీకొట్టడంతో హోంగార్డు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉప్పల్ హిల్స్ కురుమ నగర్ ప్రాంతానికి చెందిన మొగుళ్ళ లింగయ్య (48) సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా పని చేస్తున్నాడు.
శుక్రవారం రోజు ఇంటి దగ్గర నుంచి ద్విచక్ర వాహనంపై డ్యూటీకి వెళ్తుండగా రామంతపూర్ ప్రగతి నగర్ కమాన్ వద్దకు రాగానే వెనుక నుంచి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అతివేగంగా వచ్చి బోర్‌వెల్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. లింగయ్య కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు 108 ఫోన్ చేయగానే వారు వచ్చి లింగయ్యను ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా లింగయ్య అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కుమారుడు మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.