పోలీసులపై పెట్రో బాంబు దాడులు
బయటపడ్డ రాజకీయ కక్షలు
పోలీసుల ఎదురుకాల్పులు
పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
కొత్తపేట,కోనసీమ జిల్లా:
అల్లరి మొక్కలు రెచ్చిపోయారు,రాజకీయ కక్షలతో పేట్రేగిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో ఆదివారం సాయంత్రం భయానక పరిస్థితి నెలకొంది.పోలీసులు ఎంత హెచ్చరించినా లెక్కచేయకుండా ఎదురు దాడికి దిగారు.పెట్రో బాంబులతో దాడులకు తెగబడ్డారు. డిఎస్పీ కే.వి.రమణ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలు మొహరించాయి. మైక్ లో ఎన్ని సార్లు హెచ్చిరించినా వారు లెక్కచేయలేదు. మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాస్వవాయువు ప్రయోగిం చారు. అయినా వారి లెక్క చేయకుండా ఎదురు దాడులు చేస్తున్నడంతో పోలీస్ కాల్పులు చేపట్టాల్సి వస్తుంది.ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పోలీస్ కాల్పులు అనంతరం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంటనే పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో ఉండే కొత్తపేట లో ఇటువంటి దారుణమైన సంఘటన ఎలా జరిగిందని కంగారు పడుతున్నారా…? అదేమీ కాదు. ఇదంతా పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్వహించిన మాక్ డ్రిల్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసకరమైన సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే నెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇటువంటి భయానిక పరిస్థితులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ ను అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు నిర్వహించారు.