రోడ్డుపై వీరంగం… కేజీఎఫ్ నటి పై దాడి… వీడియో వైరల్ గతేడాది కేజీఎఫ్‌-2లో అలరించిన స్టార్‌ నటి రవీనా టాండన్‌. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది. ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్‌కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్‌ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు. ‍‍దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. …

రోడ్డుపై వీరంగం… కేజీఎఫ్ నటి పై దాడి… వీడియో వైరల్

గతేడాది కేజీఎఫ్‌-2లో అలరించిన స్టార్‌ నటి రవీనా టాండన్‌. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది.

ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్‌కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్‌ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు.

‍‍దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ముంబయిలో రవీనా టాండన్‌, తన డ్రైవర్‌లో కలిసి వెళ్తుండగా రోడ్డుపై వెళ్లున్న కొందరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒక్కరు గాయపడ్డారు. దీంతో వారి కుటుంబసభ్యులంతా కలిసి డ్రైవర్‌పై గొడవకు దిగారు.

అ తర్వాత రవీనా టాండన్‌ కారు దిగి గాయపడిన వారిపై వాగ్వావాదానికి దిగింది. దీంతో వారంతా ఒక్కసారిగా రవీనా టాండన్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విస్తృతంగా వైరలవుతోంది.

అయితే మరోవైపు గాయపడిన కుటుంబసభ్యులు రవీనా టాండన్‌ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిందని అన్నారు.

పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదని..రవీనా టాండన్‌ మా అమ్మను కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు పేర్కొన్నారు. చివరికీ ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

Updated On 2 Jun 2024 7:15 PM IST
cknews1122

cknews1122

Next Story