పలు దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
తాళం వేసిన ఇండ్లు అతని టార్గెట్
దొంగిలించిన ఆభరణాలు హైదరాబాద్ లో అమ్మకం
కొంత సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు
మఠంపల్లి పోలీసులను అభినందించిన సీఐ చరమందరాజు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ( రామయ్య) జూన్ 05
పలు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశామని హుజూర్నగర్ సీఐ గజ్జె చరమందరాజు తెలిపారు.వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం వైకుంటా పురం గ్రామానికి చెందిన
వనమాల సైదులు తండ్రి మల్లయ్య, వయస్సు: (45) సం,లు, అనువ్యక్తి ఇంటి యజమానులు తాలంవేసి ఊరుకు వెళ్ళిన ఇండ్లను టార్గెట్ చేసి తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం ,వెండి అబరణాలు, డబ్బులను దొంగిలించుకుని పోవడంలో సిద్దహస్తుడు,
ఇతనికి మద్యం త్రాగే, గుట్కా తినే సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నది, ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయి గతంలో మట్టంపల్లి మండలం హుజూర్నగర్ నందు రాత్రి సమయంలో ఇండ్లలోకి ప్రవేశించి తాళాలను పగులగొట్టి బంగారు,వెండి అబరణాలు, డబ్బులను దొంగిలించుకుని పోవడం వలన కేసులు అయి జైలుకు పోవడం జరిగింది ఇలాచేయడం వలన భార్య ఇతడిని వదిలిపెట్టి తల్లి గారింటికి వెళ్ళింది అప్పటినుండి హైదరాబాద్ లో ఉంటూ గత కోతకాలం క్రితం మట్టంపల్లి వచ్చినాడు.
వెచ్చ చంద్రశేకర్ తండ్రి పిచ్చయ్య అనునతను మట్టంపల్లి లోని గురుకుల పాఠశాలకు ఎదురుగా కిరానా షాపు నడుపుకొని జీవిస్తాడు, ఒంగోలు నందు అతని తాతయ్య అనారోగ్యంతో చనిపోవడం వలన తేది 28.04.2024 రోజు చంద్ర శేకర్ కుటుంబంతో సహా ఇంటికి తాళంవేసి వెళ్ళగా, ఇంటికి తలం వేసినది గమనించిన వనమల సైదులు తేది. 01.05.2024 రాత్రి సమయంలో ఇనుప రాడ్డు తో చంద్రశేకర్ ఇంట్లోకి ప్రవేశించి తలుపులకు వేయబడిన తాళంను రాడ్డుతో పగులగొట్టి, ఇనుప బీరువాను పగులగొట్టి దానిలో ఉన్న బంగారు అబగారణాలు దొంగిలించుకొని హైదరాబాద్ వేల్లిపోయినాను అక్కడ గుర్తుతెలియని వ్యక్తులకు వాటిని అమ్మి రూ. 2,00,000/- తీసుకొని దానిలో రూ. 30,000/- జల్సాలకు వఖర్చు పెట్టుకున్నాడు .,
మిగిలిన నల్లపూసల గొలుసు, బంగారు లాకెట్ కలిగిన గొలుసు మరియు బంగారు చెవి దిద్దులు మరియు డబ్బులు రూ. 1,70,000/- తో మట్టంపల్లి వచ్చి మరల వాటిని తీసుకొని హైదరాబాద్ కు వెళ్ళుటకు ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయంలో మట్టంపల్లి అటో స్టాండ్ వద్దకు వెల్లెసరికి ఇక్కడ పోలీస్ వారు వాహనాలను తనిఖీ చేయుచుండగా అనుమానాస్పదంగా అగుపించగా నేరస్తుడిని పట్టుకొని విచారించగా ఈ విషయం తెలిసింది.
గతంలో ఇతని పై ఆరు కేసులు ఉన్నాయి,
ఇట్టి కేసును చాకచక్యంగా చేదించిన పోలీస్ సిబ్బంది, మట్టంపల్లి ఎస్సై రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ పీ. వెంకటేశ్వర్లు, ఐడి పార్టీ కానిస్టేబుల్ లు నాగరాజు, శంబయ్య మరియు హోంగార్డ్ మనోహర్ రెడ్డి లను సీఐ అభినందించారు .