విద్యుత్ షాక్ తో గేదెలు మృతి భారీగా అస్తి నష్టం దిక్కుతోచని స్థితిలో రైతు చిల్లా వెంకటయ్య సి కే న్యూస్ (సంపత్) జూన్ 07 రామన్నపేట, విద్యుత్ షాక్ కి గురై గేదెలు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే రామన్నపేట మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన చిల్ల వెంకటయ్య అనే రైతుకు చెందిన 5 గేదెలు రోజువారీగా మేతకి విడిచిపెట్టారు. అదే క్రమంలో సాయంత్రం మూడు గేదెలు తిరిగి వచ్చాయి.మిగితా …

విద్యుత్ షాక్ తో గేదెలు మృతి

  • భారీగా అస్తి నష్టం
  • దిక్కుతోచని స్థితిలో రైతు చిల్లా వెంకటయ్య

సి కే న్యూస్ (సంపత్) జూన్ 07

రామన్నపేట, విద్యుత్ షాక్ కి గురై గేదెలు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే రామన్నపేట మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన చిల్ల వెంకటయ్య అనే రైతుకు చెందిన 5 గేదెలు రోజువారీగా మేతకి విడిచిపెట్టారు.

అదే క్రమంలో సాయంత్రం మూడు గేదెలు తిరిగి వచ్చాయి.మిగితా రెండు గేదెలు తిరిగి రాకపోవడంతో రైతు వెంకటయ్య చుట్టూ ప్రక్కల ప్రాంతలో వెతికినా రాత్రి వరకు వాటి జాడ దొరకలేదు.

అవి అటుగా వెళ్లి మండలంలోని మునిపంపుల గ్రామశివారు రైతుల భూమిలో గల కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కి తగిలి షాక్ తో మృతి చెందినట్టు ఉదయం అక్కడి ప్రాంత ప్రజలు సమాచారం ఇవ్వడంతో వెళ్లి చూడగా అట్టి గేదెలు వెంకయ్యకు చెందినవి కావడంతో రైతు దిక్కు తోచని స్థితిలో ఉండి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ప్రాణంగా పెంచి పోషించుకునే గేదెలు చనిపోవడంతో సుమారు వాటి విలువ రెండు లక్షల రూపాయల ఉంటుందని తనకి ఉన్న వాటిలో పెద్ద గేదెలు అందులో ఒకటి సుడితోటి, మరొకటి పాలు ఇచ్చే గేదెలు అవ్వడం వాటి ద్వారానే కుటుంబం జీవనం సాగిస్తున్నారు. రైతును ప్రభుత్వం చిరువ తీసుకుని ఆదుకోవాలని గ్రామస్థులు, చుట్టూ ప్రక్కల వారు కోరుతున్నారు.

Updated On 7 Jun 2024 3:53 PM IST
cknews1122

cknews1122

Next Story