వైఎస్సార్‌సీపీ కార్యాలయం ధ్వంసం తిరుపతి నగరంలోని ఎస్కే ఫాస్ట్‌ఫుడ్‌ సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూటమి మూకలు ధ్వంసం చేశారు. ఎనిమిదో డివిజన్‌ పరిధిలో ఉన్న కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు. షట్టర్‌ ఓపెన్‌ చేసి గ్లాస్‌ డోరుకు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడి చేసి లోపలికి దూరి ఫర్నీచర్‌ మొత్తం ధ్వంసం చేశారు. ఇందులో టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్ని విరిగిపోయాయి. కావాలనే ఇలాంటి దాడులకు తెగబడినట్లు తెలుస్తుంది. కూటమి మూకలంతా …

వైఎస్సార్‌సీపీ కార్యాలయం ధ్వంసం

తిరుపతి నగరంలోని ఎస్కే ఫాస్ట్‌ఫుడ్‌ సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూటమి మూకలు ధ్వంసం చేశారు. ఎనిమిదో డివిజన్‌ పరిధిలో ఉన్న కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు.

షట్టర్‌ ఓపెన్‌ చేసి గ్లాస్‌ డోరుకు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడి చేసి లోపలికి దూరి ఫర్నీచర్‌ మొత్తం ధ్వంసం చేశారు. ఇందులో టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్ని విరిగిపోయాయి.

కావాలనే ఇలాంటి దాడులకు తెగబడినట్లు తెలుస్తుంది. కూటమి మూకలంతా కూడా నిత్యం కార్యాలయం సమీపంలోని ఓ చికెన్‌ షాపు మూసేసిన సమయంలో గంజాయి తాగేవారిని తెలిసింది.

అయితే పోలీసులు గుర్తించి ఎలక్షన్‌ టైంలో వీరిని తరిమి కొట్టడంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయం వారే పోలీసులకు సమాచారం ఇచ్చారని వారే భావించి దాడులకు తెగబడినట్లుగా తెలుస్తుందన్నారు.

అయితే ఆ సమయంలో కార్యకర్తలు ఎవరూ లేకపోవడం గమనార్హం. వారి వద్ద బ్యాట్లు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గెలిచి ఒకరోజు కూడా కాకముందే వీరు రౌడీయిజం చేయడంతో ఐదేళ్లు ఎలా భరించాలని ప్రజలు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయ నిర్వాహకులతో ఫిర్యాదు తీసుకున్నారు.

Updated On 7 Jun 2024 6:58 AM IST
cknews1122

cknews1122

Next Story