ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు.
రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు.
వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడ్డారు. దీంతో రామోజీరావు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో గంటలో
ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్
రిలీజ్ చేయనున్నారు అనే లోపే తుది శ్వాస విడిచిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. ఉదయం 4.50 నిమిషాలకు ఆకాలమరణం.
ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.
87 ఏళ్ల వయస్సున్న ఆయన ఈనాడు గ్రూప్‌కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని. 60కి పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని భాషల సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఆయనపై ఎన్నో విమర్శలు, వివాదాలు ఉన్నాయి.