ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడ్డారు. దీంతో రామోజీరావు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో గంటలోఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్రిలీజ్ చేయనున్నారు అనే లోపే తుది శ్వాస విడిచిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. ఉదయం …

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు.

రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు.

వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడ్డారు. దీంతో రామోజీరావు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో గంటలో
ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్
రిలీజ్ చేయనున్నారు అనే లోపే తుది శ్వాస విడిచిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. ఉదయం 4.50 నిమిషాలకు ఆకాలమరణం.

ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.

రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.

రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

*_టిజేఎస్ఎస్ ల సంయుక్త సంతాపం_*

*_మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వరావులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియాకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైనవని అన్నారు.

87 ఏళ్ల వయస్సున్న ఆయన ఈనాడు గ్రూప్‌కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని. 60కి పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని భాషల సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఆయనపై ఎన్నో విమర్శలు, వివాదాలు ఉన్నాయి.

Updated On 8 Jun 2024 12:23 PM IST
cknews1122

cknews1122

Next Story