బస్సుఆపడానికి వెళ్లిన ప్రయాణికుడి పై దాడి. బస్సు లేక అవస్థలు పడుతున్న ప్రజలు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ యాక్షన్. ప్రయాణికులకు సరిపడా లేని ఆర్టీసీ బస్సులు.! ఓక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణం.! ప్రయాణమా" నరకమా.! బస్సు ఆపడానికి వెళ్లిన ఓ ప్రయాణికుడి పై షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో పనిచేసే డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు చాలాసేపటి నుండి బస్సు కోసం విసిగి వేసారిన జనాలు ఒక్కసారిగా బస్సు రావడంతో బస్సు దగ్గరికి వెళ్లారు …

బస్సుఆపడానికి వెళ్లిన ప్రయాణికుడి పై దాడి.

బస్సు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ యాక్షన్.

ప్రయాణికులకు సరిపడా లేని ఆర్టీసీ బస్సులు.!

ఓక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణం.!

ప్రయాణమా" నరకమా.!

బస్సు ఆపడానికి వెళ్లిన ఓ ప్రయాణికుడి పై షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో పనిచేసే డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు చాలాసేపటి నుండి బస్సు కోసం విసిగి వేసారిన జనాలు ఒక్కసారిగా బస్సు రావడంతో బస్సు దగ్గరికి వెళ్లారు సమయపాలన అడిగి బస్సు ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ ను అడగడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ ప్రయాణికుడు పై దాడికి పాల్పడ్డాడు

ఇప్పటికే ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఒక్కో బస్సులో 55 మంది ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి ఉండగా 120 మంది వరకు ప్రయాణికులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం ఒకటైతే సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు

ఇక రాత్రి 8గంటల 30 నిమిషాల నుండి అర్ధరాత్రి అయినా షాద్ నగర్ కు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణాన్ని కొనసాగించకపోవడంతో అటు బైపాస్ లో పోయే బస్సులు కూడా బైపాస్ లో ఆపకపోవడంతో అసలు షాద్ నగర్ ప్రజలు చేసుకున్న పాపమెంటని మండిపడుతున్నారు

షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలు దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ కోరగా దాడి జరిగింది వాస్తవమేనని ఆ డ్రైవర్ ను పిలిపించి మాట్లాడుతానని చెప్పడం కోసం మెరుపు ఇక డిపోలో సరిపడా బస్సులు లేవని ఇప్పటికే పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు..

Updated On 9 Jun 2024 10:56 PM IST
cknews1122

cknews1122

Next Story