లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జిల్లా జడ్జి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఎస్ గోవర్ధన్ రెడ్డి సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 10 శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రములో ఆదివారం సూర్యాపేట ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసినారు. వారికి దేవస్థాన పాలక వర్గం, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దేవస్థాన అర్చకులు …

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జిల్లా జడ్జి

కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఎస్ గోవర్ధన్ రెడ్డి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 10

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రములో ఆదివారం సూర్యాపేట ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసినారు.

వారికి దేవస్థాన పాలక వర్గం, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దేవస్థాన అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందచేసినారు.

వీరికి దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్ కుమార్ వారలు శ్రీ స్వామివారి మెమొంటోనీ అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో హుజూర్నగర్ సబ్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, మఠంపల్లి ఎస్సై ఆంజనేయులు వారలు పాల్గొన్నారు.

Updated On 10 Jun 2024 7:24 AM IST
cknews1122

cknews1122

Next Story