జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. సి కే న్యూస్ (సంపత్) జూన్ 10 టి యు డబ్ల్యూ జేదీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టి యు డబ్ల్యూ జె (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు భువనగిరి మల్లేశం అన్నారు. సోమవారం భువనగిరిలో జరిగిన టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసినందున ఇచ్చిన మాటను నిలుపు …

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి..
సి కే న్యూస్ (సంపత్) జూన్ 10
టి యు డబ్ల్యూ జే
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టి యు డబ్ల్యూ జె (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు భువనగిరి మల్లేశం అన్నారు.
సోమవారం భువనగిరిలో జరిగిన టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసినందున ఇచ్చిన మాటను నిలుపు కోవాలన్నారు. గతంలో పట్టాలు ఇచ్చిన జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు ఫీజులలో రాయితీ ఇవ్వాలన్నారు.జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి అన్నారు.ఈనెల 19, 20వ తేదీలలో ఖమ్మంలో నిర్వహిస్తున్న టియుడబ్ల్యూజే మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు.
సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెలిమినేటి జహంగీర్,పాశం నవీన్,ఆరే కుమార్,బాలకృష్ణ,శశిధర్ రెడ్డి, సైమన్,బైరి విశ్వనాథం,ఎం మల్లేశం,ఎండి జమాలుద్దీన్, సతీష్, సురేష్ , జి నాగరాజు, పి నరసింహచారి, ఎండి అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.
