—-పార్క్ నిర్మాణం లో అవినీతి పరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించదు .
— సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ అవినీతి మరియు నిర్మాణం లోపాన్ని బయటకు తీసిన ఎమ్మేల్యే డాక్టర్ మట్టా రాగమయి , డాక్టర్ మట్టా దయానంద్.
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
స్టానిక తామర చెరువు ను సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ మంగళవారం నాడు చెరువును పరిశీలించి అనంతరం తామర చెరువు కట్ట మీద నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ ను సంబంధిత అధికారులు తో కలిసి పార్క్ నిర్మాణం లో జరిగిన నాణ్యత లోపాలను స్వయంగా పరిశీలించినరు.
గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ పూర్తి చెయ్యకుండా కనీసం టైల్స్ వేసినప్పుడు సిమెంట్ కూడా వాడకుండా కేవలం మట్టి మీద టైల్స్ వేసిన సంఘటనలు ను ఎమ్మెల్యే స్వయంగా అధికారులు ముందు బయటపెట్టినరు. కేవలం డబ్బులు కోసం కాంట్రాక్టర్ నాసిరకం నిర్మాణం చేపట్టి ప్రభుత్వ డబ్బులను దోచుకున్నారు అని అన్నారు .
ఫ్రీడమ్ పార్క్ లో భారీ అవినీతి జరిగింది అని విచారించి అవినీతి ని బయటకు తీసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి అని అక్కడి ప్రజలు ఎమ్మెల్యే కీ పిర్యాదు చెయ్యటం తో విజిలన్స్ అధికారులు తో దర్యాప్తు చేపించి బాద్యులు పై చర్యలు తీసుకుంటాము అని ఎమ్మెల్యే అన్నారు .దయానంద్ మాట్లాడుతూ కేవలం ఒక్క తామర చెరువు కట్ట మీద సుమారు 3 కోట్ల కుంబకోణం జరిగింది అని తెలిపారు.
అత్యంత దారుణం గా కనీస నిబంధనలు పాటించకుండా కేవలం డబ్బులు కోసం పార్క్ నిర్మించినట్లుగా బిల్లు లు పాస్ చేసుకున్నారు అని పార్క్ లో ఆహ్లాద వాతావరణం కోసం మంచి మొక్కలు కూడా వెయ్యకపోవటం దారుణం అని తెలిపారు. పార్క్ నిర్మాణం లో అవినీతి పరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించదు అని తెలిపిన ఎమ్మెల్యే , డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు.