—బస్సు సర్వీసులు పెంచాలనీ ప్రదర్శన, డిఎం కార్యాలయం ముట్టడి.
— పి ఓ డబ్ల్యు, పి వై ఎల్.
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
ప్రయాణికులకు బస్ సర్వీసులు పెంచాలని,డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ, ప్రగతిశీల యువజన సంఘం పీ వై ఎల్ ఆధ్వర్యంలో ప్రదర్శన సత్తుపల్లి డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సిఐ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.
ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోకినేపల్లి లలిత, ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం వాగ్దానాలలో ఒకటి మేము అమలు చేస్తామని చెప్పుకుంటూ ఉచితంగా ప్రయాణం కల్పించారు
తప్ప సరిపడ బస్ సర్వీస్ లో ఏ ఒక్క డిపోలో కూడా ఏర్పాటు చేయలేదని బస్ సర్వీసులు తక్కువ ఉన్నాయని, ప్రయాణికులు ఇబ్బంది పడుతూ రద్దీ ఎక్కువ ఉండటం వలన బస్సులలో నుంచి కిందపడి మరణించిన పరిస్థితి కళ్ళముందు కనపడుతున్నాయని
బస్సు డ్రైవర్ కండక్టర్లు కూడా ప్రయాణికుల రద్దీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నదని ఇంత ఒత్తిడి జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రదర్శన మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి పరిమళ, వెంకటనరసమ్మ, ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు కామేష్, నాయకులు అలివేలు వెంకటమ్మ దుర్గ రామకృష్ణ వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.