టెన్త్‌లో 10 GPA సాధిస్తే ఇంటర్‌లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్ విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెన్త్‌లో 10 GPA సాధించిన విద్యార్థులకు మంచి కాలేజీల్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టెన్త్ టాపర్లకు పురస్కారాల అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్‌ నేతృత్వంలో ప్రభుత్వ …

టెన్త్‌లో 10 GPA సాధిస్తే ఇంటర్‌లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్

విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

టెన్త్‌లో 10 GPA సాధించిన విద్యార్థులకు మంచి కాలేజీల్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

టెన్త్ టాపర్లకు పురస్కారాల అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్‌ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.

విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు మూసివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు 'ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెన్త్‌లో 10 GPA సాధించిన విద్యార్థులకు మంచి కాలేజీల్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated On 11 Jun 2024 5:07 PM IST
cknews1122

cknews1122

Next Story