ఆధార్ – రేషన్ కార్డు అనుసంధానానికి 3 నెలల గడువు పొడిగింపు..
హైదరాబాద్: ఆధార్- రేషన్ కార్డ్ను లింక్ చేయని వారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
2024 జూన్ 30తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 30 వరకు పెంచింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకొనేందుకు ఆధార్- రేషన్ కార్డ్ను లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించిన విషయం విదితమే.
ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేయాలనుకునేవారు రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్కు వెళ్లి ‘link Aadhaar with the active ration card’ ఆప్షన్ను ఎంచుకోండి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.