కంచే చేను మేస్తే… మత్స్య శాఖలో రాజ్యమేలుతున్న అవినీతి
బాహాటంగానే డబ్బులు అడుగుతున్న మత్స్యశాఖ అధికారులు
ఒక్కొక్క సంఘం ఏర్పాటు చేయాలంటే 50 వేల రూపాయల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి
ఒకే గ్రామంలో రెండో సొసైటీలు ఎలా చేస్తారు అది ఎంతవరకు సాధ్యం
చెరువుల వేలం ఇతర కులస్తులతో నిర్వహిస్తున్న మత్స్యశాఖ అధికారులు
రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిని పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వం
గతంలో మత్స్యశాఖ పై విజిలెన్స్ విచారణ జరిగినట్లు సమాచారం
ఆరోపణలు చేస్తున్న మత్స్య సహకార సంఘాల సభ్యులు
గత ప్రభుత్వం పేదల ఆర్థిక స్వావలంబన కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగానే కులవృత్తులు అంతరించిపోకుండా వారికి ఆర్థిక చేయూతను కల్పిస్తూ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఆదాయ సమూపార్జన వైపు అడుగులు వేయించింది. అయితే ఈ కులవృత్తులలో భాగంగా చెరువులపై ఆధారపడిన ముదిరాజ్, బెస్త కులస్తులను చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా చేయూత అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
అయితే ఈ పథకంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని ఎన్ని ఆరోపణలు వినిపిస్తున్న వాటిని పట్టించుకున్న నాథుడే లేడనే విమర్శలు కూడా బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము లబ్ధిదారుల చేతికి అందకుండా అవినీతి అధికారుల పాలు అయినట్లు పత్రికల్లో ఎన్ని కథనాలు ప్రచురించిన ఉన్నతాధికారులకు గానీ ప్రభుత్వ పెద్దలకు గాని చీమ కుట్టినట్లయినా లేకపోవడం ఆ అధికారులకు కూడా ఈ అవినీతి సొమ్ములో వాటాలు ఉన్నట్లు బాహాటంగానే విమర్శిస్తున్న వారు ఎంతోమంది మొదటగా గత ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి సంఘాలను ఏర్పాటు చేసి మత్స్యశాఖ సహకార సంఘంతో భాగస్వామ్యం చేయాలని సూచించింది కానీ అందుకు విరుద్ధంగా జిల్లా మత్స్యశాఖ అధికారిని వ్యవహరించిన తీరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఏదైనా సొసైటీ ఏర్పాటైన మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు ఉన్న వాటిని ఎందుకు అమలు చేయడం లేదో ఆ అధికారినికే తెలియాలి.
57 సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేకపోవడంలో ఆంతర్యం ఏమిటి
కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయాలంటే కమిషన్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అసలు పనే జరగదు. గతంలో ఒక సహకార సంఘం ఏర్పాటు చేయాలంటే ఆ చెరువు ఎఫ్ టి ఎల్ విస్తీర్ణం చెరువు 22 ఎకరాల ఉండి తీరాలి దానికి 11 మంది సభ్యులు ఉంటేనే సహకార సంఘంగా ఏర్పాటు అవుతుంది. ఈ నిబంధనలతో కొంతమందికే లాభం జరుగుతుందని గ్రహించిన గత ప్రభుత్వాలు.
మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సంఘాలకు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. తద్వారా రంగారెడ్డి జిల్లాలో నూతనంగా 100 సంఘాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 27 మండలాల గాను సుమారు 500 గ్రామాల్లో ముదిరాజులు బెస్త కులస్తులు ఉన్నారు
ఈ గ్రామాల్లో సుమారు 250 సంఘాలకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ 1084 సంఘాలు మాత్రమే ఏర్పాటు చేశారు అదేవిధంగా సంఘం ఏర్పడిన మూడు నెలల లోపు ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది కానీ నిబంధనకు విరుద్ధంగా ఇప్పటివరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మూడు పథకాలను ప్రవేశపెట్టింది
1.నీలి విప్లవం,2. రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన,3. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ మూడు పథకాలలో కలిపి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి
ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగడం లేదంటే పై స్థాయి అధికారులు వీరికి ఎంత సహకరిస్తున్నారో అర్థం అవుతుంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో ప్రారంభించింది.
ఈ పథకంలో కూడా భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించిన పట్టించుకున్న నాథుడే లేడు గతంలో మత్స్యకార సంఘం నాయకులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి మరియు మత్స్య శాఖ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని మత్స్య శాఖ సహకార సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గతంలో ఉచిత చేప పిల్లల పంపిణీ లో భాగంగా నాణ్యతలేని చేప పిల్లలను పంపిణీ చేశారని అవి సరైన బరువు రాక మత్స్యకారులు నష్టపోతున్నారని చివరకు చెరువుల కౌలు కూడా చెల్లెలించలేని స్థితిలో మత్స్యకారులు ఉన్నారని ఆవేదం వ్యకం చేస్తున్నారు.
ప్రభుత్వం వందల కోట్లు మత్స్య కార అభివృద్ధికి కేటాయిస్తున్న అది ఇప్పటివరకు అందని ద్రాక్ష గానే మిగులుతోందని అధికారులు మాత్రం అవగాహన సదస్సులు ప్రారంభోత్సవాల పేరిట బిల్లులు పెట్టి భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మత్స్య శాఖలో ఏ పని కావాలన్నా ప్రత్యక్షంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి
వీరికి ఫోన్ పే, గూగుల్ పే ల రూపంలో చెల్లించిన ఆధారాలు కూడా మత్స్య సహకార సంఘం నాయకుల దగ్గర ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో చెప్పకనే చెప్పవచ్చు. కనీస అవగాహన కూడా లేకుండా డబ్బులకు కక్కుర్తి పడి ఒకే గ్రామంలో రెండు మత్స్యకార సొసైటీలు చేసి వేల రూపాయలను వసూలు చేస్తున్నారని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.
సొసైటీలు లేని గ్రామాల్లో చెరువులపై ఆధారపడిన ముదిరాజ్ బెస్త కులస్తులను పిలిచి చెరువులను వేలం వేయాల్సి ఉంటుంది కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతర కులస్తులతో చెరువుల వేలం నిర్వహించి దొరికిన కాడికి దోచుకుంటున్నారని తద్వారా చేపలనే నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారని ఏ అధికారి దృష్టికి తీసుకెళ్లిన మాకు సరైన న్యాయం జరగడం లేదని ఇటు సొసైటీలు వేయక అటు చెరువులపై న్యాయం జరగక రెండు విధాల నష్టపోతున్నారు.
రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిని పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు గాని ప్రభుత్వ పెద్దలు గాని చర్యలు తీసుకోకపోవడం గమనార్హం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొర్రెల మేకల పంపిణీ పై 700 కోట్ల అవినీతి జరిగిందని అలాగే మత్స్య శాఖలో అవినీతి జరిగిందని చెప్పేంతవరకు కూడా కిందిస్థాయి అధికారులకు ఆ విషయం తెలియలేదంటే అవినీతి ఊడలు ఎంత లోపలికి వెళ్లాయి అర్థం చేసుకోవచ్చు