అంత:కరణ శుద్ధి అనలేకపోయిన నారా లోకేష్..! నారా లోకేష్ మళ్లీ అదే తప్పు చేశాడు. మరోసారి ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇవాళ ప్రమాణ స్వీకారం వేళ ఆయన మరోసారి ట్రోలింగ్ చేసే వాళ్లకు అడ్డంగా దొరికిపోయారు. భరత్ అనే నేను సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో మహేష్ బాబు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు … తెలుగులో ప్రమాణం చేస్తూ.. అంత:కరణ శుద్ధి అనే పదాన్ని సరిగా పలకలేకపోతాడు. ఇప్పుడు ఇదే …

అంత:కరణ శుద్ధి అనలేకపోయిన నారా లోకేష్..!

నారా లోకేష్ మళ్లీ అదే తప్పు చేశాడు. మరోసారి ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇవాళ ప్రమాణ స్వీకారం వేళ ఆయన మరోసారి ట్రోలింగ్ చేసే వాళ్లకు అడ్డంగా దొరికిపోయారు.

భరత్ అనే నేను సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో మహేష్ బాబు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు … తెలుగులో ప్రమాణం చేస్తూ.. అంత:కరణ శుద్ధి అనే పదాన్ని సరిగా పలకలేకపోతాడు. ఇప్పుడు ఇదే సీన్ నారా లోకేష్ విషయంలో నిజంగా జరిగింది, ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే.. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ తర్వాత లోకేష్ వంతు వచ్చింది.

అయితే నారా లోకేష్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ప్రారంభించిన ఆయన.. అంత:కరణ శుద్ధితో అనే పదాన్ని సరిగా పలకలేకపోయారు. దీంతో… అంత:కరణ శుద్ధి అనకుండా అంతర్గత అంటూ.. నారా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఇప్పుడు ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు చాలామంది ట్రోలర్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

ఇక నారా లోకేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి అదే మంగళగిరి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా ఏంటో చూపించారు. చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీని ముందుండి నడిపించారు. నారా లోకేష్ ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Updated On 12 Jun 2024 12:47 PM IST
cknews1122

cknews1122

Next Story