మురికి కూపం కాలనీవాసులకు శాపం 9, 10 వ వార్డులో ఉన్న ఓపెన్ డ్రైనేజీ సమస్యను తీర్చి కాలనీ వాసుల ఆరోగ్యాలను కాపాడండి — చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ నాయకులు ఎరుకల సాయి సికె న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి (శ్రీనివాస్) జూన్ 12 చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 9, 10 వ వార్డులో ఉన్న మాకం శివాజీ ఇంటి ముందు నుండి గంజి చంద్రశేఖర్ 100 మీటర్ల ఓపెన్ డ్రైనేజీ సమస్యను తీర్చి అక్కడ అండర్ …

మురికి కూపం కాలనీవాసులకు శాపం

  • 9, 10 వ వార్డులో ఉన్న ఓపెన్ డ్రైనేజీ సమస్యను తీర్చి కాలనీ వాసుల ఆరోగ్యాలను కాపాడండి

— చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ నాయకులు ఎరుకల సాయి

సికె న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి (శ్రీనివాస్) జూన్ 12

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 9, 10 వ వార్డులో ఉన్న మాకం శివాజీ ఇంటి ముందు నుండి గంజి చంద్రశేఖర్ 100 మీటర్ల ఓపెన్ డ్రైనేజీ సమస్యను తీర్చి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి కాలనీ వాసుల ఆరోగ్యాలను కాపాడాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల సాయి మున్సిపల్ అధికారులను కోరారు.

బుధవారం పత్రిక ప్రకటన ద్వారా వారు తెలియజేస్తూ.. 9, 10 వ వార్డులో ఉన్న ఈ ప్రధాన మురికి కాలువలో విష సర్పాలు కూడా మురుగు నీటిలో తిరుగుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు.

దోమల బెడదతో కాలనీవాసులు అనారోగ్యాలకు గురవుతున్నారని వెంటనే అట్టి మురికి కాలువను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సాఫీగా మురుగునీళ్లు వెళ్లేలా చేసి కాలనీవాసుల ఆరోగ్యాలను కాపాడాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను కోరారు.

Updated On 12 Jun 2024 8:15 PM IST
cknews1122

cknews1122

Next Story