విద్యార్థులకు బిగ్ అలర్ట్.. టీఎస్ లాసెట్ ఫలితాలు ఆ రోజే విడుదల! లాసెట్ రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు జూన్ 12న గురువారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు లాసెట్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. లాసెట్‌ రాసిన విద్యా్ర్థినీ విద్యార్థులు …

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. టీఎస్ లాసెట్ ఫలితాలు ఆ రోజే విడుదల!

లాసెట్ రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు జూన్ 12న గురువారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు లాసెట్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. లాసెట్‌ రాసిన విద్యా్ర్థినీ విద్యార్థులు ఫలితాల కోసం https://lawcet.tsche.ac.in లింక్‌పై క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది సంబంధించి జూన్ 3న టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉదయం మొదటి సెషన్‌, మధ్యాహ్నం రెండో సెషన్, సాయంత్రం మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈ సారి లాసెట్ రాసేందుకు ఉన్నత విద్యా మండలికి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందాయి.

Updated On 12 Jun 2024 12:36 PM IST
cknews1122

cknews1122

Next Story