పేదింటి మహిళకు ఎం జి ఎఫ్ వారి ఆర్థిక చేయూత
50 వేల రూపాయల చెక్కును అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి
బ్రాంచ్ మేనేజర్ నరేష్ కి ప్రత్యేక అభినంధనలు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 13
హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో నివాసముంటున్న పేద ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్నటువంటి కాజ బేగం కుమార్తె ఎస్.కె జహీన్ కు 50000/- వేల రూపాయల ఆర్థిక సాయం చెక్ ద్వారా వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి అందజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో సంపత్ రెడ్డి మాట్లాడుతూ
పేద కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000/- అందజేస్తున్నటువంటి ఫౌండేషన్ వారు
ఇప్పుడు సింగిల్ విడో డాటర్ స్కీం ద్వారా వివాహ కార్యక్రమానికి 50000/- వేల రూపాయల చేయూతన అందజేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో హుజూర్నగర్ బ్రాంచ్ మేనేజర్ నరేష్ తో పాటు రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు నాగులు పాల్గొన్నారు.