నన్ను ఉద్యోగ విధుల్లోకి తీసుకోండి….!
నాపై ఆరోపణలు తగవు.
అవుట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగి ఆవేదన.
ఖమ్మం జిల్లా
పాలేరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ లో ల్యాబ్ అటెండెంట్ గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న తనను,హాస్టల్ లో జరిగే విషయాలను అక్కడే పని చేస్తున్న స్టాఫ్ నర్స్ భర్తకు తెలియజేస్తున్నానని అనుమానం తో…తనను కాలేజ్ ప్రిన్సిపల్ రత్నకుమారి విధుల్లోకి తీసుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని సదరు ఉద్యోగి చైతన్య… మంగళవారం కాలేజ్ ఎదుట కూర్చొని నిరసన తెలియజేశారు.
ఈసందర్భంగా చైతన్య మీడియా తో మాట్లాడుతూ…హాస్టల్ విషయాలను స్టాఫ్ నర్స్ భర్తకు తెలియజేస్తున్ననని, తనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ నర్స్,ప్రిన్సిపల్ రత్నకుమారి సూచన మేరకు పిర్యాదు చేసినట్లు తెలిపింది.
పోలీస్ స్టేషన్ ఎస్సై తనను స్టేషన్ కు పిలిచి,ఫోన్ లోని కాల్ డేటా ను పరిశీలించి…
వారు చేసిన ఆరోపణలు అవాస్తమని తేల్చి చెప్పినట్లు చైత్యన్య అన్నారు.
ఆరోపణలు అవాస్తమని నిర్దారణ జరిగినప్పటికీ,
ప్రిన్సిపల్ రత్నకుమారి…తనను ఉద్యోగ విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తోందని ఆవేదనవ్యక్తం చేశారు.
తన పరువుకు భంగం కలిగించిన స్టాఫ్ నర్స్,ప్రిన్సిపల్ రత్నకుమారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చైతన్య డిమాండ్ చేశారు.
తన ఉద్యోగాన్ని తాను చేసుకునేలా ఉన్నతధికారులు అవకాశం కల్పించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసినట్లు ఆమె తెలిపారు.