శభాష్ హుజూర్ నగర్ పోలీస్
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ పోగొట్టుకున్న రూ 34 వేల రూపాయలు
తిరిగి వారికే అప్పగించిన పోలీస్ లు
ఏఎస్ఐ రమేష్ ను అభినందించిన సీఐ చరమందరాజు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 13
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వారు కోదాడ నుండి హుజూర్ నగర్ కు రాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ డబ్బులున్న సంచి మర్చిపోయారు.
ఇదే విషయం పై హుజూర్ నగర్ పోలీసు స్టేషను నైట్ పెట్రోలింగ్ లో ఉన్న ఎఎస్ ఐ రమేష్ కు తెలపగా వెంటనే స్పందించి మిర్యాలగూడ డిపోకి పోన్ చేసి డ్యూటీ ఉన్న ఆర్టీసీ డ్రైవర్ నెంబరు తీసుకుని పోన్ చేసి విషయం చెప్పగా బస్సు డ్రైవర్ అదే బస్ లో వీళ్ళు మర్చిపోయిన సంచిని సంచిలో ఉన్న వారీ దుస్తులు 34,000రు లను గుర్తించి వాటిని మిర్యాలగూడెం డిపోలో అప్పగించారు.
పోలీసులు వాటిని రికవరీ చేసుకొని గురువారం బాధితులకు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఎస్ ఐ ముత్తయ్య ఎ ఎస్ ఐ రమేష్ చేతుల మీదగా బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా సీఐ చరమందరాజు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరి గట్ట్టు వద్ద నివాసం ఉంటున్న ఆవుల శంభయ్య లక్ష్మీ దంపతులు వీరి కులం బుడబుక్కల.
వృత్తి యాచక వృత్తి. వీళ్ళు మేడారం జాతర,భద్రాచలం ,వీరభద్ర స్వామీ దేవాలయవద్ధ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వారు 34,000రు ఉన్న నగదు సంచితో బుదవారం రాత్రి కోదాడ నుండి హుజూర్ నగర్ కు వచ్చేందుకు మిర్యాలగుడెం డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ TS 05 Z 0217 బస్ లో ప్రయణం చేస్తూ రాత్రి 11 గంటల సమయంలో హుజూర్ నగర్ లో దిగారు.
నగదు ఉన్న సంచి బస్ లోనే మర్చి పోవడం తో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు పిర్యాదు చేసారు. పిర్యాదు తీసుకున్న ఎ ఎస్ ఐ రమేష్ చాకచక్యంగా వ్యవహరించి బాదితునికి ఆ నగదు దుస్తులును ఇప్పించారు. ఏఎస్ఐ రమేష్ ను పోలీసులు స్తానిక ప్రజలు అభినందించారు.