భర్తకు ఉద్యోగం పోయిందని మనస్తాపంతో భార్య మృతి…. తన భర్త చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం పోయిందని కలత చెంది మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉపయోగించే కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది.పాలకవీడు ఎస్సై లక్ష్మీనరసయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉబెల్లి ఉమ (27) అనే యువతికి …

భర్తకు ఉద్యోగం పోయిందని మనస్తాపంతో భార్య మృతి….

తన భర్త చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం పోయిందని కలత చెంది మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉపయోగించే కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది.పాలకవీడు ఎస్సై లక్ష్మీనరసయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉబెల్లి ఉమ (27) అనే యువతికి సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో చెందిన కొండ ప్రదీప్ అనే వ్యక్తితో గత మూడు నెలల క్రితం వివాహం జరిగిందన్నారు.

ఇవాళ ఆమె భర్త ప్రదీప్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోయిందని అప్పటి నుంచి ఆమె మనస్థాపానికి గురై తరచూ బాధపడుతూ ఉండేదని అన్నారు.

అయితే గత నాలుగు రోజుల క్రితం తన తల్లిగారి ఊరైన జాన్ పహాడ్ వచ్చిందని బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసే కొక్కానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

మృతురాలు తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

Updated On 13 Jun 2024 2:40 PM IST
cknews1122

cknews1122

Next Story