లాసెట్ ఫలితాలు విడుదల… చెక్ చేసుకోండి ఇలా
తెలంగాణ లాసెట్/ పీజీఎల్‌సెట్-2024 లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ తో పాటు లాసెట్ కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు.
ఈ నెల 3వ తేదీన తెలంగాణ లాసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా న్యాయవిద్యలో ప్రవేశాలు పొందొచన్చు. జూన్ 3న ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ జరిగింది.
ఇక మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్ష ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్షను నిర్వహించింది.
మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి. అలాగే, ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలనుకునేవారు ఎల్ఎల్ బీ డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి.
తాజాగా లాసెట్ ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటిస్తారు. ర్యాంకుల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించడం జరుగుతుంది.
లాసెట్ ఫలితాలు చెక్‌చేసుకునే విధానం..
తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి https://lawcet.tsche.ac.in/ వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాసెట్ పరీక్ష ఫలితాల ఆఫ్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నెంబర్, పుట్టినతేదిని నమోదు చేయాలి. అక్కడ ఇచ్చిన గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.