ఎటువంటి రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.. తాజాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూన్ 19.. అర్హతలు, జీతం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అర్హతలు.. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి..
వయస్సు.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి వయసు గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు ఉండాలి. అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొందరికి సడలింపు కూడా ఉంటుంది..
జీతం.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారికి 37 వేలు వరకు జీతం ఉంటుందని తెలుస్తుంది..
ఎంపిక ప్రక్రియ..
DRDO యొక్క ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు..
ఇక ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..