ఫారెస్ట్ అధికారులపై దాడులు..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కాల్పులు తండాలోనీ అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజు సుమారు 11 గంటల సమయంలో దాడి జరిగింది. ప్లాంటేషన్ నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె రాధిక సిబ్బందితో కలిసి వెళ్ళింది.
అదే గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్ అక్కడ చదును చెయడం పరిశీలించి ట్రాక్టర్ను ఆపే నిమిత్తం వెళ్ళగా తాండవాసులందరూ ఏకమై వారి పైన దాడికి ఎగబడ్డారు. కనీసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆడ మనీషి అని చూడకుండా ఆమెపై కూడా దాడి చేయడం జరిగింది
ముఖ్యంగా దాడిలో సాయి కృష్ణ సెక్షన్ ఆఫీసర్ కు ఎక్కువగా గాయాలయ్యాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో కలిసి ఐదుగురు సిబ్బంది, ఇద్దరు బేస్ క్యాంప్ సిబ్బందిపై 40 మంది తాండవాసులు కలిసి దాడి చేయడం జరిగింది.
వెంటనే మోపాల్ పోలీస్ లకు వారి సమాచారం అందించడంతో ఏసిపి వెంకట్ రెడ్డి సిఐ మరియు ఎస్సై గంగాధర్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతం కి వెళ్లడం జరిగింది.చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.