భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధానికి చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. చాలా మంది పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండాల్సింది ఎఫైర్ లతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
పచ్చని తమ సంసారంలో చిచ్చుపెట్టుకుంటున్నారు.
అక్రమ సంబంధాలు మోజులో పడి, తమ జీవితాన్ని, తమ పిల్లలు, కుటుంబంపరువును బజారును పడేసుకుంటున్నారు. మరికొందరు ఈ ఎఫైర్ ల మోజులో పడి కట్టుకున్న వారిని, కన్నవారిని కడతెర్చడానికి సైతం వెనుకాడటంలేదు. ఆఫీసుల్లో, ఇంటి పక్కన వారితో, మాజీ ప్రియుడు, ప్రియురాలితో చాలా మంది తమ సీక్రెట్ బాగోతాలు కొనసాగిస్తుంటారు.
మరికొందరైతే.. తమ ఎఫైర్ లకు భాజాప్త కొనసాగిస్తు.. అక్కడ ఒక వారం ఉంటాం.. ఇక్కడ ఒక వారం ఉంటామని తమ పార్టనర్ లకు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.
ఇటీవల మిస్ వైజాగ్ ఘటనలో ఆమె భర్త ఆఫీసులోనే మరో యువతితో అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్ లో డీడీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాలు.. ముషిరాబాద్ ఆర్టీసీ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఆఫీస్ లో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. డీడీ కాలనీలో ఒక అపార్ట్ మెంట్ లో వీరి చీకటి బాగోతం నడుస్తుంది. మొదటి నుంచి తన భర్త ప్రవీణ్ పై.. భార్యకు అనుమానంగా ఉండేది.
దీంతో రెడ్ హ్యండెడ్ గా పట్టుకొవాలని ఈరోజు డీడీ కాలనీలో వీరు ఉంటున్న నివాసానికి వెళ్లారు. అప్పటికే గదిలో ప్రవీణ్ తన ప్రియురాలితో ఉన్నాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన భార్య, ఆమె బంధువులు, బిడ్డలు.. ప్రవీణ్ పై దాడికి దిగారు.
అంతే కాకుండా.. భర్త ఘన కార్యంను నిలదీశారు. అప్పుడు భర్త .. ప్రవీణ్ భార్యపై చేయిచేసుకున్నాడు. మహిళ అని చూడకుండా కడుపులో, ముఖం మీద ఇష్టమున్నట్లు పిడిగుద్దులు కురిపించాడు.
ప్రవీణ్ పిల్లలు కూడా అతనిపై ప్రతిదాడికి పాల్పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ ను, అతని ప్రియురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
నా భర్తకు చాలా మంది మహిళలతో ఎఫైర్ లు.. తన భర్త ప్రవీణ్ కుమార్ కు పదిహేనళ్ల క్రితమే పెళ్లి జరిగిందని అతని భార్య చెప్పింది. ముగ్గురు పిల్లలున్నారని చెప్పింది. తమదీ ఆఫీసులకు.. లైసెన్సులు ఇచ్చే బిజినెస్ అని చెప్పింది. ప్రవీణ్.. ఆఫీసులో పనిచేసే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆమెకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని కూడా చెప్పింది.
ప్రవీణ్ ఒక స్త్రీలోలుడని, కామాంధుడని, ఇదివరకు అనేక మంది మహిళలతో సంబంధం ఉందంటూ బాంబు పేల్చింది. ఇది వరకు భర్తపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, కోర్టులో కేసు ఉందని చెప్పుకొచ్చింది.
ఈ కేసు వాపస్ తీసుకొవాలని తన భర్త పలుమార్లు తనపై దాడిచేసినట్లు భార్య వాపోయింది. ఒక వారం భార్యతో, మరో వారం ప్రియురాలితో ఉంటానంటూ కూడా భర్త తనకు ఆఫర్ ఇచ్చాడని భార్య చెప్పింది.
తనకు, తన ముగ్గురు పిల్లలకు న్యాయం చేయాలని ప్రవీణ్ భార్య పోలీసులు ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.