మందుబాబులకు బ్యాడ్ న్యూస్…. పెరగనున్న లిక్కర్ ధరలు మందు బాబులకు ఇది కొంచెం చేదువార్తే. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. అయితే, ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో ధరల పెంపునకు సిద్దమవుతోంది ప్రభుత్వం. అన్ని బ్రాండ్ల మద్యంపై 20 …

మందుబాబులకు బ్యాడ్ న్యూస్…. పెరగనున్న లిక్కర్ ధరలు

మందు బాబులకు ఇది కొంచెం చేదువార్తే. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు.

2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. అయితే, ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో ధరల పెంపునకు సిద్దమవుతోంది ప్రభుత్వం.

అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.

తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు కొంత అదనపు ఆదాయం అవసరమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం మద్యం ధర పెంచితే ఆ అదనపు ఆదాయం రానుంది.

ఇలా అన్ని రకాల ఆల్కహాల్ బ్రాండ్ల ధరలను 20-25% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ ధరలు పెంపుపై వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏటా ప్రభుత్వానికి రూ.37 వేల కోట్లు వరకు సమకూరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాలు అమలుకు ఈ పెరిగిన ఆదాయం కచ్చితంగా కొంతమేర ఉపయోగపడనుంది.

అందుకే, దాదాపుగా ధరలు పెంచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.

Updated On 16 Jun 2024 9:53 PM IST
cknews1122

cknews1122

Next Story