జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
సి కే న్యూస్ (సంపత్) జూన్ 16
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న(32) పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో యాదాద్రి భువనగిరి జిల్లా పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీం మెంబర్ సెక్రటరీ బి.శాంతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 18 నుండి 22వ తేది సాయంత్రం 5 గంటలలోగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ (టీం) ఆఫీసులో అందజేయాలని తెలిపారు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఇంతకు పూర్వం ప్రజావాణి లేదా టీం కార్యాలయం యందు అప్లై చేసుకున్న వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నందు గల టీం ఆఫీస్ నందు లేదా https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ నందు సంప్రదించాలన్నారు.10 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యుట్ నుండి PGDCA సర్టిఫికేట్ ఉండాలని తెలిపారు.4 డిసెక్షన్ హాల్ అటెండెంట్స్ పోస్టుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణత మరియు అనాటమీ (డిసెక్షన్ హాల్) లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నందు 1 సంవత్సరం అనుభవం ఉండాలని తెలిపారు.4 ల్యాబ్ అటెండెంట్స్ పోస్టుల కోసం BSC MLT లేదా DMLT ఉత్తీర్ణత మరియు పారా మెడికల్ బోర్డు యందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని తెలిపారు.8 సబర్డినేట్ స్టాఫ్ పోస్టుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు.2 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం డిప్లమా ఇన్ మెడికల్ రికార్డ్ మరియు మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ లో అనుభవం కలిగి ఉండాలని తెలిపారు.4 థియేటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణత మరియు గుర్తింపుపొందిన ఇనిస్టిట్యూట్ నుండి ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని తెలిపారు.ఇట్టి పోస్టులను మెరిట్, అర్హతల ఆధారముగా భర్తీ చేయబడునని, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 18 నుండి 44 సంవత్సరాల వయస్సు, అర్హతలు కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తుతో పాటు విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవపత్రం, ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ కాపీలు జతపరచి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయములోని తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) కార్యాలయములో ఈ నెల 18 నుండి 22వ తేది సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించాలని, నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, పూర్తి వివరాలకు టీం ఆఫీస్, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సంప్రదించాలని ఆమె అట్టి ప్రకటనలో తెలిపారు.