హ్యాపీ ఫాథర్స్ డే శుభాకాంక్షలు
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గంలో బాధావత్ హాథి రామ్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం
మా అమ్మ నాకు జీవితాన్ని ఇస్తే, మా నాన్న నాకు బతకడం అంటే ఏంటో నేర్పించాడు.. నా చేయి పట్టుకుని నా భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆశతో తన జీవితాన్ని త్యాగం చేశాడు. నన్ను మంచి వ్యక్తిని చేసినందుకు ధన్యవాదాలు నాన్న..
ఇప్పటికీ, ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మీరు నా జీవితంలో ఉన్నందుకు థాంక్యూ నాన్న.. నేను చాలా అదృష్టవంతుడిని.. హ్యాపీ ఫాదర్స్ డే.
కొంతమంది తండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటారు, మరికొందరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు.. అలా అని పిల్లలను ప్రేమించరని కాదు, వారు తమ ప్రేమను వ్యక్తపరిచే విధానం అది. ఒక కుమార్తెకు తన పెళ్లయ్యాక తండ్రి ప్రేమ ఏమిటో తెలుస్తుంది, కొడుకు.. అతను తండ్రి అయినప్పుడు తండ్రి గొప్పతనం అర్థమవుతుంది.. మీ కొండంత ప్రేమ ఇప్పుడు అర్థమవుతోంది నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే.
ఎవరైనా తండ్రి కావచ్చు, కానీ కొద్దిమంది మాత్రమే మంచి నాన్న అవుతారు.. వారిలో ఒకరు మీరు. నాన్న మీరు చాలా ప్రత్యేకమైనవారు, నాకు ఎలా బతకాలో నేర్పించారు.. లవ్ యూ నాన్న…. హ్యాపీ ఫాదర్స్ డే.
మా భవిష్యత్ కోసం నువ్వు చిందించిన ప్రతి చెమట చుక్క రుణం తీర్చుకుంటాను, నువ్వు నాకు భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన బహుమతి. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు.. నాన్న నేను నీకు మంచి పేరు తీసుకొస్తాను.. పితృ దినోత్సవ శుభాకాంక్షలు..
మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ఎవరు అడిగినా నా జీవితంలో నేను చూసిన సూపర్ హీరో మా నాన్నే అని చెబుతాను.. నాన్న, నా కోసం మీ జీవితాన్ని ఖర్చు చేసినందుకు మీకు కృతజ్ఞతలు.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు
దేశాన్ని రక్షించే సైనికుడిలా మమ్మల్ని రక్షించే యోధుడివి, నాకు మీరే బెస్ట్ ఫ్రెండ్… హ్యాపీ ఫాదర్స్ డే
తల్లి ప్రేమతో కూడిన ఒడిని అందిస్తే.. తండ్రి రక్షణతో కూడిన భుజాన్ని ఇస్తాడు..
పిల్లల భవిష్యత్ కోసం జీవితాన్నే ఖర్చు చేసే గొప్ప వ్యక్తిత్వం తండ్రిది. మీరు లేని మా జీవితాలు శూన్యం.. హ్యాపీ ఫాదర్స్ డే.
ఒక తండ్రి కూతురి చేతిని కొన్నేళ్లు మాత్రమే పట్టుకుంటాడు.. కానీ ఆమె హృదయంలో తండ్రి ఇచ్చిన ధైర్యం జీవితాంతం ఉంటుంది..
ప్రియమైన నాన్న.. నా జీవితంలో ఎందరు పరిచయం అవుతారో.. ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు.. కానీ నా జీవితంలో మెుదటి వ్యక్తివి ఎప్పుడూ నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే
ప్రియమైన నాన్న మీరు ప్రపంచంలో ఒక్కరే కావొచ్చు.. కానీ నాకు మాత్రం మీరే ప్రపంచం..
నాన్నగారూ… మీ శ్రమ, త్యాగం, బాధ వల్లనే నేను సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను.. మీకు ధన్యవాదాలు చెప్పడం అనేది చాలా చిన్న పదం.. హ్యాపీ ఫాదర్స్ డే
ఈ క్షణంలో నా ఆనందానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం నువ్వే నాన్న.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు
నా జీవితంలో అత్యుత్తమ రోజు మీరు మీ అరచేతులలో మొదటిసారి నన్ను ఎత్తుకుని నా నుదిటిపై ముద్దు పెట్టిన రోజు… హ్యాపీ ఫాథర్స్ డే
పిల్లల భవిష్యత్ బాగుండాలని తమ జీవితాలను ఖర్చు చేస్తున్న తల్లిదండ్రుల కు ఫాథర్స్ డే శుభాకాంక్షలు