ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజాసింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా మెదక్ వెళతానని ఇప్పటికే రాజా సింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముంబై నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్ పోర్ట్ లో అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం..మరింత ముదిరి తీవ్ర …
![ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్](https://cknewstv.in/wp-content/uploads/2024/06/Screenshot_2024-06-16-14-32-14-103_com.eterno-edit.jpg)
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజాసింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా మెదక్ వెళతానని ఇప్పటికే రాజా సింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముంబై నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్ పోర్ట్ లో అరెస్టు చేశారు.
మెదక్ జిల్లాలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం..మరింత ముదిరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి రెండు వర్గాలు..పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
అల్లర్లలో పలు దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ..పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో ముందస్తుగా రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)