మరోసారి మానవత్వం చాటుకున్న కడాలి నాగరాజు. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), జూన్ 17, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర బిక్షాటన చేసుకుని జీవిస్తున్న ఒక వృద్ధుడు నాలుగు రోజుల క్రితం కాలుజారి పడిపోవడం జరిగినది, మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల నడుము కింద భాగాన బోన్ ఫ్యాక్చర్ అయినది, నడవలేని పరిస్థితిలో భిక్షాటన చేసుకునే ప్లేస్లో కూల …

మరోసారి మానవత్వం చాటుకున్న కడాలి నాగరాజు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జూన్ 17,

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర బిక్షాటన చేసుకుని జీవిస్తున్న ఒక వృద్ధుడు నాలుగు రోజుల క్రితం కాలుజారి పడిపోవడం జరిగినది, మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల నడుము కింద భాగాన బోన్ ఫ్యాక్చర్ అయినది, నడవలేని పరిస్థితిలో భిక్షాటన చేసుకునే ప్లేస్లో కూల బడిపోయి ఉన్నాడు,

సోమవారం కుసుమ హరినాథ్ బాబా ఆలయ అర్చకులు నరసింహమూర్తి సమాజ సేవకుడు నాగరాజు కి ఫోన్ చేసి విషయం చెప్పినారు, వెను వెంటనే నాగరాజు అక్కడికి చేరుకొని ఆయన్ని పరామర్శించి ఎలా ఉన్నదని అడిగి తెలుసుకుని వెంటనే 108 కి ఫోన్ చేసి వాహనం వచ్చేదాకా ఉండి వారి సహాయంతో 108 లోకి ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి డ్యూటీ డాక్టర్ కి విషయం తెలియజేసి పెద్దాయనకి సిమెంట్ కట్టు వేయాలని చెప్పి 45 రోజులు పాటు మీ హాస్పిటల్ లోనే చూసుకుంటూ ఆయనకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ ని వేడుకని హాస్పిటల్లో జాయిన్ చేసినాడు.

Updated On 17 Jun 2024 6:53 PM IST
cknews1122

cknews1122

Next Story