సీనియర్ జర్నలిస్ట్ యల్క సైదులు మృతి బాధాకరం సైదులు మృతి పట్ల పలువురు సంతాపం ఘనంగా నివాులర్పించిన జర్నలిస్టు మిత్రులు శోక సముద్రంతో సాగిన నిఖార్సైన జర్నలిస్టు అంతిమ యాత్ర సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 17 హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ యల్క సైదులు సోమవారం తెల్లవారు జామున గుండె పోటుతో మృతి చెందారు. యల్క సైదులు వివిధ పత్రికల్లో చానల్స్ లో జర్నలిస్ట్ గా పనిచేసి స్వతహాగా …

సీనియర్ జర్నలిస్ట్ యల్క సైదులు మృతి బాధాకరం

సైదులు మృతి పట్ల పలువురు సంతాపం

ఘనంగా నివాులర్పించిన జర్నలిస్టు మిత్రులు

శోక సముద్రంతో సాగిన నిఖార్సైన జర్నలిస్టు అంతిమ యాత్ర

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 17

హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ యల్క సైదులు సోమవారం తెల్లవారు జామున గుండె పోటుతో మృతి చెందారు. యల్క సైదులు వివిధ పత్రికల్లో చానల్స్ లో జర్నలిస్ట్ గా పనిచేసి స్వతహాగా అక్షర సమరం పేపరు స్థాపించి హుజూర్ నగర్ నయోజకవర్గంలో వివిధ ప్రజా సమస్యలను వెలికి తీసి అవినీతి అక్రమాలపై తన దైన శైలిలో వార్త కథనాలు రాసి నిఖార్సైన జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు పొందారు.

జర్నలిస్ట్ యల్క సైదులు మృతి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. పట్టణ ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు జర్నలిస్టులు బంధుమిత్రులు సైదులు కు ఘన నివాళులు అర్పించారు.

Updated On 17 Jun 2024 6:48 PM IST
cknews1122

cknews1122

Next Story