అన్నదమ్ముల మధ్య భూవివాదం….. కొడుకును కడతేర్చిన తండ్రి
భూ వివాదం ఒకరి ప్రాణం తీసింది. అన్నదమ్ముల మధ్య గొడవ వివాదాస్పదంగా మారి కత్తిపోట్లకు దారితీసింది. పెద్ద కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.కొడుకుల మద్య భూ వివాదంతో తండ్రీ కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోట గంగారాజంకు రాజేశ్, రాకేశ్ ఇద్దరు కుమారులు.
గంగారాజం, అతడి కుమారుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ కలిసి గంగరాజం మాట్లాడుకుందామని బందువుల ఇంటి వద్ద సమావేశం అయ్యారు
భూమి విషయంలో పెద్ద కుమారుడు రాజేశ్, చిన్న కుమారుడు రాకేశ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో తండ్రీ గంగరాజం పెద్ద కుమారుడు రాజేశ్ పై కత్తితోదాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి.
హుటాహుటిన రాజేశ్ ను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించే క్రమంలో మృతి చెందారు.
పోలీసులకు లొంగిపోయిన తండ్రీ.. భూ వివాదంతో తనయుడి పై కత్తితో దాడి చేసిన తండ్రీ గంగరాజం పోలీసులకు లొంగిపోయాడు.
ఆస్తి విషయంలో గొడవ జరుగగా క్షణికావేశంలో తానే దాడి చేశానని గంగరాజం ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.