ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి ఉపాధ్యాయుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతన్ని గ్రామస్తులు చెట్టు కట్టేసి కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తె.. మండలంలోని నెమలిపేట గిరిజన ప్రాథమిక పాఠశాలలో లావుడియా రాందాస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని వివాహిత కుటుంబీకులు పాఠశాలకు విధులకు వచ్చిన రామ్ దాస్‌ను చితకబాది గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక చెట్టుకు తాళ్లతో …

ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి

ఉపాధ్యాయుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతన్ని గ్రామస్తులు చెట్టు కట్టేసి కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తె.. మండలంలోని నెమలిపేట గిరిజన ప్రాథమిక పాఠశాలలో లావుడియా రాందాస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఇతను అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని వివాహిత కుటుంబీకులు పాఠశాలకు విధులకు వచ్చిన రామ్ దాస్‌ను చితకబాది గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఆ మహిళను కూడా కుటుంబీకులు గ్రామస్తులు చితక బాధారు.

ఈ విషయం తెలుసుకున్న అశ్వరావుపేట పోలీసులు గ్రామానికి వెళ్లి ఉపాధ్యాయుడు రాందాస్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated On 18 Jun 2024 9:38 PM IST
cknews1122

cknews1122

Next Story