బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప చెల్లు మనిపించిన ACP హైదరాబాద్ పాతబస్తీలో షాకింగ్ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఏసీపీ చేయి చేసుకోవడం కలకలం రేపింది. కార్వాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అమర్ సింగ్‌పై అసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ చేయిచేసుకున్నారు. ఓ హోటల్ మూసివేత విషయంలో ఘర్షణ చోటుచేసుకోగా.. హోటల్ క్లోజ్ చేయాలని ఏసీపీ కిషన్ చెప్పారు. ఇంకా టైం కాలేదని.. బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని అమర్ సింగ్ బదులివ్వగా.. దీంతో అతడి …

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప చెల్లు మనిపించిన ACP

హైదరాబాద్ పాతబస్తీలో షాకింగ్ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఏసీపీ చేయి చేసుకోవడం కలకలం రేపింది. కార్వాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అమర్ సింగ్‌పై అసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ చేయిచేసుకున్నారు.

ఓ హోటల్ మూసివేత విషయంలో ఘర్షణ చోటుచేసుకోగా.. హోటల్ క్లోజ్ చేయాలని ఏసీపీ కిషన్ చెప్పారు. ఇంకా టైం కాలేదని.. బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని అమర్ సింగ్ బదులివ్వగా..

దీంతో అతడి చెంపను ఏసీపీ చెళ్లుమనిపించాడు. ఘటన తర్వాత పోలీసు స్టేషన్ ఎదుట అమర్ సింగ్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated On 18 Jun 2024 10:19 AM IST
cknews1122

cknews1122

Next Story