ఆయన కాంగ్రెస్ లోకి వద్దు… కన్నీళ్ళు పెట్టుకున్న కాంగ్రెస్ నేత!
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే ఏకంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది.
ఎందుకంటే కారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఆ పార్టీలోని కీలక నేతలందరూ కూడా చివరికి కారు దిగి అధికారంలో చెయ్యి అందుకుంటున్నారు. దీంతో బిఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చాటుతుందనుకుంటే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది బిఆర్ఎస్ పార్టీ.దీంతో ఆ పార్టీ పతనం మొదలైందని ఇక రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు అంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలో దాదాపు 20 పైగా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రాబోతున్నారు అంటూ చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే కారు పార్టీలోని కీలక నేతలందరూ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉండడం సంచలనంగా మారింది.
కాగా ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునెందుకు సిద్ధమయ్యాడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. ఆయనను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు మంత్రి జూపల్లి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలా కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాక ఖరారు అయిన నేపథ్యంలో గద్వాల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సరిత తిరుపతయ్య ఎమ్మెల్యే బండ్ల రాకను వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తమకు కొత్త వాళ్ళ రాకతో అన్యాయం జరుగుతుంది అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే న్యాయం చేయాలంటూ ఎంపీ మల్లు రవి నివాసం చేరుకున్నారు.
అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చిస్తానని.. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా మాట్లాడుతాను అంటూ ఎంపీ మల్లు రవి హామీ ఇచ్చారు.