జటప్రోలు గ్రామపంచాయితీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికార యాంత్రాంగం
సీకే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి:
గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వద్దు
తక్షణమే గ్రామపంచాయతీ కార్మికులకు గ్లౌజులు,మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలి
మండల సంబంధిత అధికారులతో తెలిపి సమస్యను తీర్చగలరు
జటప్రోలు గ్రామంలో వారి సమస్యలు తెలుపుకుంటున్న గ్రామపంచాయతీ కార్మికులు
పెంట్లవెల్లి మండల పరిధిలోని మరియు ,జటప్రోలు, గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు .
గ్రామాలలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మురికి కాలువలు, రోడ్లు శుభ్రం చేయడం , తడి , పొడి , చెత్త లను వేరు చేసి ట్రాక్టర్ పై తీసుకెళ్లి ఊరికి దూరంగా ఉంచి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా , ఎవరు కూడా రోగాల బారిన పడకుండా, చూసేది గ్రామంలో ఒక్క గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రమే.
అలాంటి వారికి గ్రామ పంచాయతీ తరపున ఎలాంటి నూనెలు , మాస్కులు , చేతులకు గ్లౌజులు , ఇవ్వకుండా సమస్య , సంబంధిత అధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు.
బుధవారం జటప్రోలు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ మాకు పనిచేస్తున్న సమయంలో చేతులకు గ్లౌజులు , మాస్కులు , శానిటైజర్లు , ఇవ్వమని గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మాపై నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక విలేకరులకు తెలిపారు
మా ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా గ్రామ ప్రజల బాగు కోసం పని చేస్తున్నా మాకు మాత్రం చేతులకు గ్లౌజులు , మాస్కులు ,ఇవ్వట్లేదని వారు బాధపడుతూ వారి సమస్యలను తెలుపుకున్నారు
ఇప్పటికే ఐదు నెలల జీతం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఈ సందర్భంగా తెలుపుకున్నారు ఇప్పటికైనా మా సమస్యలను అర్థం చేసుకొని మండల సంబంధిత అధికారులకు తెలిపి మా సమస్య తొలగించాలని వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి గ్రామ విలేకర్ల ద్వారా వారి సమస్యలను తెలుపుకున్నారు